CM KCR: నవంబర్‌ 4 నుంచి హుజూరాబాద్‌లో దళితబంధు అమలు: సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 20/10/2021 00:29 IST

CM KCR: నవంబర్‌ 4 నుంచి హుజూరాబాద్‌లో దళితబంధు అమలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: దళితబంధు అమలును ఎన్నిరోజులు ఆపుతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో నవంబర్‌ 4 నుంచి దళితబంధు అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దళిత బంధు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుందన్నారు. దళితబంధుకు ఈసీ చిన్న ఆటంకం కలిగించిందని సీఎం పేర్కొన్నారు.
హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళితబంధు పథకం అమలును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ పథకం అమలుపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖపై చర్చించిన అనంతరం ఈ పథకానికి సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియ అంతటినీ ఉప ఎన్నిక ముగిసేంత వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్‌కుమార్‌ స్పష్టం చేస్తూ సోమవారం రాష్ట్రానికి లేఖ రాశారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని