Corona: తెలంగాణలో కొత్తగా 746 కేసులు

తాజా వార్తలు

Updated : 19/07/2021 20:16 IST

Corona: తెలంగాణలో కొత్తగా 746 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,20,165 నమూనాలను పరీక్షించగా 746 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,37,373కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,764కి పెరిగింది. ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 729 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో 9,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 71 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.59 శాతం కాగా.. రికవరీ రేటు 97.86 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని