TS: లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయండి 

తాజా వార్తలు

Updated : 19/05/2021 19:24 IST

TS: లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయండి 

డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి సీపీ, ఐజీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా సీఎం కేసీఆర్‌ రోజూ సమీక్షిస్తున్నారన్నారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని, దీంతో మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని తెలిపారు. ఉదయం 6గంటల నుంచే మినహాయింపులు ఉన్నా జనం మాత్రం 8గంటలకు బయటకు వస్తున్నారని డీజీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేసేందుకు కమిషనర్‌ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. చేపలు, కూరగాయల మార్కెట్ల వద్ద జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 10గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులపైనే కాకుండా అంతర్గత రహదారులు, కాలనీలపైనా దృష్టిపెట్టాలన్నారు. పోలీసులు గస్తీ వాహనాల్లో సైరన్‌ శబ్దం చేస్తూ కాలనీల్లో సంచరించాలని డీజీపీ ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని