Curfew వేళ ప్రజలు సహకరించాలి: డీజీపీ

తాజా వార్తలు

Updated : 20/04/2021 22:37 IST

Curfew వేళ ప్రజలు సహకరించాలి: డీజీపీ

హైదరాబాద్‌: తెలంగాణలో రాత్రి వేళ కర్ఫ్యూ పటిష్ఠంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో ఈ రోజు రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ఫ్యూ నిబంధనలపై పౌరులను చైతన్యపర్చాలని సూచించారు. స్వీయరక్షణకు ఎంత బాధ్యతగా ఉంటామో సమాజ శ్రేయస్సు విషయంలోనూ అంతే బాధ్యతగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నేపథ్యంలో పోలీసు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

* జీవోలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధిగా కర్ఫ్యూ అమలు చేయాలి.
* కర్ఫ్యూ సమయంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదు.
* అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలన్నింటినీ రాత్రి 8 గంటల వరకు మూసివేసేలా చూడాలి.
* జీవోలో స్పష్టంగా ఉన్నందున మినహాయింపు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలి.
* గూడ్స్ వాహనాలను ఆపకూడదు.
* తమ పరిధిలోని వివిధ సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో కర్ఫ్యూ నిబంధనలపై సమావేశం నిర్వహించి చైతన్య పర్చాలి.
* మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలను తప్పకుండా పాటించాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని