రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే కొనసాగిస్తాం: డీహెచ్‌
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 18:37 IST

రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే కొనసాగిస్తాం: డీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

‘‘లాక్‌డౌన్‌ మొదటివారంలో రాష్ట్రంలో 29,779 యాక్టివ్‌ కేసులు ఉంటే, ప్రస్తుతం కేవలం 8,360 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక పాజిటివిటీ రేటు 6.74శాతం ఉండగా, ఈ వారంలో 1.40శాతంగా ఉంది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారి శాతం 90శాతం ఉండగా, ఇప్పుడు 96శాతంగా ఉంది. లాక్‌డౌన్‌ మొదలైనప్పుడు ఆస్పత్రుల్లో పడకల కావాల్సిన వారు 52శాతం ఉండగా, ఇప్పుడు 16శాతం మందికి మాత్రమే బెడ్స్‌ అవసరమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 55,442 కొవిడ్‌ బెడ్‌లు అందుబాటులో ఉంటే, 8,734మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,413మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4321మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్‌పై 1,221మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,727మంది ఉన్నారు’’ అని వివరించారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మే 25 నుంచి జూన్‌ 13 వరకూ హై రిస్క్‌ ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. ఇప్పటివరకూ 16.75లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. మరోవైపు  సర్వే ద్వారా 4 లక్షలకు పైగా కిట్లు అందించాం. ఇంటింటి సర్వే మూడు రౌండ్లు పూర్తయింది. ఈ సర్వేను కొనసాగించాలని నిర్ణయించాం’ అని శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణలో కొత్తగా 1511 కేసులు

తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో చికిత్స పొందుతూ గత 24 గంటల్లో 12మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 2,175మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,461 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 139, నల్గొండలో 113 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని