Ts News: థర్డ్‌వేవ్‌పై సరైన ఆధారాల్లేవ్‌: డీహెచ్‌

తాజా వార్తలు

Published : 08/07/2021 15:50 IST

Ts News: థర్డ్‌వేవ్‌పై సరైన ఆధారాల్లేవ్‌: డీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని ప్రజారోగ్య సంచాల‌కులు (డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు తెలిపారు. కొవిడ్‌ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడో వేవ్‌ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు లేవన్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని డీహెచ్‌ తెలిపారు. ఇప్పటి వరకు 1.20కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 30లక్షల మందికి పైగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకొనే వారు ఉన్నారన్నారు. హైదరాబాద్‌ నగరంలో 100కు పైగా టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి సీజనల్‌ వ్యాధులు కూడా చాలా వరకు తగ్గాయని డీహెచ్‌ తెలిపారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధులు మిషన్‌ భగీరథ నీటి వల్ల తగ్గాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెండేళ్లు మలేరియా ఫ్రీ రాష్ట్రంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీహెచ్‌ వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని