Devarayamjal: దర్యాప్తుపై తొందరెందుకు?

తాజా వార్తలు

Updated : 08/05/2021 13:04 IST

Devarayamjal: దర్యాప్తుపై తొందరెందుకు?

నలుగురు ఐఏఎస్‌ల కమిటీ విచారణపై హైకోర్టు 

హైదరాబాద్‌: దేవరయాంజల్‌ భూములకు సంబంధించి ఎప్పట్నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడు తొందరెందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకు? అని ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా ?అని ధర్మాసనం అడిగింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) స్పందిస్తూ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కమిటీ విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వారి వివరణ తీసుకున్నాకే నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని దేవదాయశాఖను హైకోర్టు ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని