దేవరయాంజల్‌ భూములపై హైకోర్టు కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 15:29 IST

దేవరయాంజల్‌ భూములపై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్‌: దేవరయాంజల్‌ భూముల సర్వేపై ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి? ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా?అని పిటిషనర్‌ సదాకేశవరెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. 

కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా?అని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేవరయాంజల్‌ భూములపై విచారణ జరిపే స్వేచ్ఛ కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ నిమిత్తం భూముల్లోకి వెళ్లేందుకు, పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకోవాల్సి వస్తే వారికి ముందస్తు నోటీసులు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అదే సమయంలో కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కమిటీకి సూచించింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని