1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

తాజా వార్తలు

Updated : 29/07/2020 18:05 IST

1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌: కోఠి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. అనంతరం కొవిడ్‌ పరీక్షలు చేసే సంచార వాహనాన్ని మంత్రి పరిశీలించారు. మొబైల్‌ ల్యాబ్‌లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు లేనివారికి ఇంట్లోనే ఐసోలేషన్‌ ఉంటుందని, అక్కడ సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామన్నారు. పది రోజులపాటు మందులు, మాస్కులు అందిస్తామని వెల్లడించారు. 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హితం యాప్‌ ద్వారా కొవిడ్‌ రోగుల వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. కరోనా వచ్చిన వారిలో 81 శాతం ఎలాంటి లక్షణాలు ఉండవని పేర్కొన్నారు. మరో 19 శాతం మందికి కరోనా లక్షణాలు ఉంటాయని వివరించారు. 14 శాతం మందికి వెంటిలేటర్‌ అవసరం ఉండదన్నారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకుంటున్నారని చెప్పారు. ఐదు శాతం మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుందని వెల్లడించారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో పరీక్షల కోసం సంచార వాహనాలు పంపుతామని తెలిపారు. లక్షణాలు కలిగిన వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తున్నామని చెప్పారు. కరోనా విస్తరించకుండా ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటల స్పష్టం చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని