Bathukamma: దుబాయ్‌ ‘బూర్జ్‌ ఖలీఫా’పై బతుకమ్మ ప్రదర్శన

తాజా వార్తలు

Published : 23/10/2021 01:10 IST

Bathukamma: దుబాయ్‌ ‘బూర్జ్‌ ఖలీఫా’పై బతుకమ్మ ప్రదర్శన

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల పూల పండుగ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని ‘బూర్జ్‌ ఖలీఫా’ స్క్రీన్‌పై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (అక్టోబర్‌ 23న) రాత్రి 9.40 -10.30గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలంగాణ బతుకమ్మ విశిష్టత తెలపడమే దీని ముఖ్య ఉద్దేశం. బూర్జ్‌ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. తెలంగాణ జాగృతి సభ్యులతో పాటు తెలంగాణలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ఎన్నారైలు, యూఏఈ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొననున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని