TS corona: కొత్తగా 3,660 పాజిటివ్‌ కేసులు

తాజా వార్తలు

Updated : 20/05/2021 19:36 IST

TS corona: కొత్తగా 3,660 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా 23 ప్రాణాలు కోల్పోగా  మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. ఇవాళ 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని