తెలుగుభాషను భావితరాలకు అందించాలి: సీజేఐ

తాజా వార్తలు

Updated : 18/07/2021 14:56 IST

తెలుగుభాషను భావితరాలకు అందించాలి: సీజేఐ

తిరుపతి: జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అష్టావధానం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తిరుపతి నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన చతుర్గుణిత అష్టావధానంలో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అవధాని మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని సీజేఐ ప్రారంభించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘అష్టావధాన ప్రక్రియ తెలుగు భాషకు ఎంతో ప్రత్యేకం. శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం ఉద్భవించింది. మాతృ భాష, జాతి ఔన్నత్యానికి అష్టావధానం ప్రతీక. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురభిమాని కాదు. మధురమైన తెలుగుభాషను భావితరాలకు అందించాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తోంది. తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలి. సాహిత్య రూపం కనుమరుగైతే తిరిగి సృష్టించలేం. సాహితీ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా మార్పు చేసుకోవాలి. సాహితీ సేవలో నా వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాను’’ అని ఎన్వీ రమణ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని