KTR Birthday: భారీ వర్షాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు హైదరాబాద్ రావొద్దు

తాజా వార్తలు

Published : 23/07/2021 17:24 IST

KTR Birthday: భారీ వర్షాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు హైదరాబాద్ రావొద్దు

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు తాను ఎవరినీ కలవడం లేదని... ఈ విషయంలో మరోవిధంగా భావించవద్దని పార్టీ శ్రేణులను కోరారు. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయం అందిస్తూ... మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

"గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాలను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇవ్వనున్నట్లు కేటీఆర్‌ కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్‌కు వస్తున్నాయని.. అవన్నీ క్రోడీకరించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ వాహనాలను అందజేస్తామని అని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని