కాలు బయట పెట్టలేం.. వాసన పీల్చలేం

తాజా వార్తలు

Updated : 18/07/2021 17:21 IST

కాలు బయట పెట్టలేం.. వాసన పీల్చలేం

హైదరాబాద్‌: నగరంలోని లింగోజిగూడ డివిజన్‌ భాగ్యనగర్ ఫేస్‌-2 కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 14నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని.. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసినా సమస్య పరిష్కరించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలం వచ్చిందటే చాలు..  డ్రైనేజీలు పొంగిపొర్లి మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి నీరు చేరుతుందన్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. రోడ్లపై డ్రైనేజీ నీరు చేరడంతో దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు.

ట్రంక్‌లైన్‌ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరైనా పక్క కాలనీవాసులు అంగీకరించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు పనులు నిలిపివేశారన్నారు. నిత్యావసరాల కోసం మార్కెట్‌ వెళ్లాలన్నా, ఉద్యోగాలు చేసేవారు విధులకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు వరద నీరు ఉండడంతో కాలనీ వాసులు అందరూ కలిసి ఒక జేసీబీని అద్దెకు తీసుకొని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడటం బాధాకరమని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇకనైనా నేతలు, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని