TTD news: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదు: జవహర్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 23/07/2021 18:16 IST

TTD news: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదు: జవహర్‌రెడ్డి

తిరుమల: కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. తిరుమాఢ వీధుల సమీపంలో ఉన్న ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలను అధికారులతో కలిసి ఈవో శుక్రవారం పరిశీలించారు. తిరుమలలో భక్తులకు ఆహ్లాదరకర వాతావరణం ఉండేలా పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాటేజీలు, రహదారుల పక్కన మొక్కలు పెంచాలని అధికారులకు సూచించారు. స్వామివారి అలంకరణకు ఉపయోగించే పూలను తిరుమలలోనే సాగు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

స్వామివారికి కైంకర్యాలు, నైవేద్యాల తయారీకి వినియోగించే నెయ్యిని తిరుమలలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈవోతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు దేశవాళీ ఆవు పాలతోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఇప్పటికే గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించే పంటతోనే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్న తితిదే... స్వచ్ఛమైన నెయ్యిని స్వామివారికి సమర్పించేలా చర్యలు చేపట్టింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని