HYD: గాంధీలో ‘సాధారణం’ ఇప్పుడే కాదు!

తాజా వార్తలు

Updated : 21/07/2021 08:01 IST

HYD: గాంధీలో ‘సాధారణం’ ఇప్పుడే కాదు!

కరోనా బాధితుల 200 దిగువకు చేరితేనే ఇతర చికిత్సలు

 

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కొవిడ్‌ బాధితుల సంఖ్య 200 దిగువకు చేరితే, వారికి ప్రత్యేక వార్డులు కేటాయించి ఇతర సాధారణ చికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే కేసుల తగ్గుదలలో పెద్దగా మార్పు కన్పించడం లేదు. ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 180 మంది వరకు బ్లాక్‌ఫంగస్‌ బాధితులున్నారు. నిత్యం 20-25 మంది వరకు డిశ్ఛార్జి అవుతున్నారు. అంతే సంఖ్యలో కొత్తగా చేరుతున్నారు. 90 శాతం రోగులు ఐసీయూలోనే చికిత్స పొందుతున్నట్లు గాంధీ వైద్యులు తెలిపారు. మరోవైపు కొవిడ్‌ అనంతరం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే మల్టీ ఆర్గాన్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(మిస్‌-సీ) కేసుల తాకిడి రెండో విడతలో అంతగా లేకపోవడంతో గాంధీ వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తొలి విడతలో ఈ తరహా కేసులు ఎక్కువగా వచ్చాయి. రెండో విడతలో మాత్రం కేవలం 14 మంది పిల్లలే ఈ లక్షణాలతో వచ్చారని వైద్యులు తెలిపారు. అందరూ కోలుకున్నారని చెప్పారు.

నేచర్‌క్యూర్‌, ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఓపీ సేవలు

సాధారణ, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా రోగులు ఇళ్లలోనే చికిత్స పొందుతుండటంతో.. ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలను ఎత్తివేస్తూ ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా అమీర్‌పేట నేచర్‌క్యూర్‌, ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రులకు కొవిడ్‌ బాధితుల రాక పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఇక్కడ సాధారణ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఆయుర్వేద ఆసుపత్రికి నిత్యం 30-40 మంది, నేచర్‌క్యూర్‌కు 10-20 అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని