TS Politics: హుజూరాబాద్‌ ఓటర్లకు తెరాస లేఖలు.. పార్టీ అధిష్ఠానం నిర్ణయం

తాజా వార్తలు

Updated : 11/08/2021 08:19 IST

TS Politics: హుజూరాబాద్‌ ఓటర్లకు తెరాస లేఖలు.. పార్టీ అధిష్ఠానం నిర్ణయం

ఏడేళ్ల అభివృద్ధి వివరాలతో రెండు లక్షలకు పైగా ముద్రణ

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస అధిష్ఠానం అక్కడ విజయం సాధించేందుకు వీలుగా పలు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, నేతలకు బాధ్యతలను అప్పగించింది. వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ‘దళిత బంధు’ పథకాన్ని నియోజకవర్గంలోని అర్హులైన దళితులందరికీ అమలుచేసేందుకు పూనుకుంది. తాజాగా ఆ నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గులాబీ రంగు లేఖలు రాయాలని నిర్ణయించింది. రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, విదేశీ విద్యానిధి తదితర పథకాల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతోపాటు నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకూ వాటిని పంపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు లక్షలకు పైగా లేఖలను సిద్ధం చేస్తోంది. నియోజకవర్గంలో తాజాగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలనూ లేఖల్లో జోడించనుంది. ఓటర్లు ఆలోచించి ప్రభుత్వానికి ఓటు రూపంలో మద్దతు తెలపాలని అందులో కోరనుంది. సీఎం కేసీఆర్‌ పర్యటన కంటే ముందే వాటిని బడ్వాడా చేసేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని