Aamir Khan: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన ఆమిర్‌ఖాన్‌

తాజా వార్తలు

Updated : 19/09/2021 22:10 IST

Aamir Khan: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన ఆమిర్‌ఖాన్‌

హైదరాబాద్‌: కోట్ల హృదయాలను కదిలించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బేగంపేట విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయనతో పాటు టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు అమీర్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. తప్పనిసరిగా అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన అమీర్‌ఖాన్‌ .. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్‌ తరాలు జీవించేందుకు అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని