Amaravati JAC: మాతో చర్చించే అర్హత మంత్రి బొత్సకు లేదు: అమరావతి ఐకాస నేతలు

తాజా వార్తలు

Published : 29/08/2021 15:43 IST

Amaravati JAC: మాతో చర్చించే అర్హత మంత్రి బొత్సకు లేదు: అమరావతి ఐకాస నేతలు

అమరావతి: తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. రాజధాని అంశంపై తాము స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే చర్చిస్తామని.. బొత్సకు తమతో చర్చించే అర్హత లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో బొత్స జీరోగా మరడం ఖాయమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా మేలుకోవాలని.. లేకపోతే ఇలాంటి అవగాహన లేని మంత్రుల కారణంగా నిండా మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజధాని సమస్యను  పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నించాలని కోరారు. రాజధానిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అమరావతిలో తిరగనివ్వబోమని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా ఏదైనా పరిష్కారమవుతుందని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని