CM JAGAN: ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

తాజా వార్తలు

Published : 25/09/2021 19:42 IST

CM JAGAN: ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

అమరావతి: తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.  గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సచివాలయాల వారీగా అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్రలో విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కి 510 కి.మీ తూర్పు ఆగ్నేయ దిశలో.. కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. ఈ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముందని అధికారులు అంచనావేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఏపీ, ఒడిశాలో 18 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. ఉత్తరాంధ్ర, గంజాం, గజపతి జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని