Ap cm Jagan: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి: సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 01/09/2021 17:54 IST

Ap cm Jagan: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి: సీఎం జగన్‌

అమరావతి: రైతులకు అవాంతరాల్లేని ఉచిత విద్యుత్‌ ఇవ్వడమే లక్ష్యమని, దీనికోసం 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో వర్షపాతం, పంటల సాగు, ఈ-క్రాపింగ్‌, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం చర్చించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం, సాగు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.  చిరు ధాన్యాలు సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీని వల్ల రైతులు మరింత ముందుకు వస్తారన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని  సీఎం స్పష్టం చేశారు.  వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌ పడుతుందనే విషయం తెలుస్తుందన్న సీఎం... మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు ఉండవన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఆర్బీకే పరిధిలో రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించాలని, వచ్చే రబీ సీజన్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 2,038 ఉద్యానవన అధికారుల పోస్టులను అగ్రికల్చర్‌ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబరులో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని