Agri gold: రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించండి: సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 08/08/2021 22:10 IST

Agri gold: రూ.20వేల లోపు డిపాజిట్లు చెల్లించండి: సీఎం జగన్‌

అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు బాగానే తనిఖీలు చేశారని, ఇతర అధికారులు కూడా తరచూ తనిఖీ చేయాలని సూచించారు. ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్‌కలెక్టర్లు 21 శాతం తనిఖీలు చేశారని, సరిగా తనిఖీలు చేయనివారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. తనిఖీ చేయకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ‘మొదట మనుషులం.. ఆ తర్వాతే అధికారులం’ అని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. వచ్చే స్పందన నాటికి నూరుశాతం పర్యవేక్షణ ఉండాలని  ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అర్హులకు పథకాలు అందించాలన్నారు. రెండు శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు గణనే ఉండట్లేదన్నారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యాకానుక అందించనున్నట్టు సీఎం చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయాలని ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌  కుమార్‌ ప్రసాద్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, పట్టణాభివృద్ది, పురపాలకశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని