CM Jagan: ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయంటే.. మనం సక్రమంగా పనిచేస్తున్నట్టే: జగన్‌

తాజా వార్తలు

Published : 22/09/2021 22:02 IST

CM Jagan: ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయంటే.. మనం సక్రమంగా పనిచేస్తున్నట్టే: జగన్‌

అమరావతి: పోలీసు స్టేషన్లకు ఎక్కువగా ఫిర్యాదులు రావడం, వాటి మీద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం చాలా మంచిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్‌లు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయనే సంశయం పోలీసులకు అవసరం లేదన్న సీఎం.. ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదు కావడం మంచిదేనని, దీన్ని తప్పుగా భావించాల్సిన అవసరంలేదన్నారు.  దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదుల నమోదుకు మనం అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు వ్యవస్థపై సమీక్షించిన సీఎం ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ కేసులు నమోదు కావడమంటే మన విధిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క అని అన్నారు. ఫిర్యాదుదారులు  ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వస్తున్నట్టేనన్నారు.  ‘‘కేరళలో ఏడాదికి 7లక్షలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయని, కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడాన్ని, ఎఫ్ఐఆర్‌లు ఎక్కువగా నమోదుకావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచన సరికాదు. మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడే ఫిర్యాదు దారులు ముందుకు రాగలుగుతారు’’ అని సీఎం జగన్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని