AP News: పరుష పదజాలం వాడిన తర్వాతే ఆందోళనలు: గౌతమ్‌ సవాంగ్‌

తాజా వార్తలు

Published : 20/10/2021 14:10 IST

AP News: పరుష పదజాలం వాడిన తర్వాతే ఆందోళనలు: గౌతమ్‌ సవాంగ్‌

మంగళగిరి: ఏపీలో హెరాయిన్‌ వ్యవహారంపై గతంలోనే స్పష్టం చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడకు సంబంధం లేదని తెలిపారు. అక్కడి నుంచి ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని ఇదివరకే మీడియా సమావేశం ద్వారా ప్రజలకు విజయవాడ సీపీ చెప్పారన్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎన్‌ఐఏ ఏజెన్సీని కూడా సంప్రదించామని తెలిపారు. డీఆర్‌ఐ అధికారులు కూడా పూర్తి సమాచారం ఇచ్చారన్నారు. డ్రగ్స్‌పై ఇన్ని సార్లు స్పష్టంగా చెప్పినా పదే పదే ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అసభ్య పదజాలం ఎవరికీ మంచిది కాదని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి దారుణంగా మాట్లాడారని చెప్పారు. పరుష పదజాలం వాడిన తర్వాతే ఆందోళనలు జరిగాయని వివరించారు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలన్నారు. నిన్న ఓ కాల్‌ వచ్చిందని ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత లేదని గౌతమ్‌ సవాంగ్‌ వివరించారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని