AP Govt: ఇకపై ప్రభుత్వ జీవోలకు ఈ-గెజిట్‌.. ఉత్తర్వులు జారీ

తాజా వార్తలు

Updated : 08/09/2021 08:54 IST

AP Govt: ఇకపై ప్రభుత్వ జీవోలకు ఈ-గెజిట్‌.. ఉత్తర్వులు జారీ

అమరావతి: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఏపీ ఈ-గెజిట్‌’ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఐఆర్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్‌లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందులో అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్‌ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని