AP high court: న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదు: జస్టిస్‌ ఏకే గోస్వామి

తాజా వార్తలు

Updated : 10/10/2021 14:51 IST

AP high court: న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదు: జస్టిస్‌ ఏకే గోస్వామి

అమరావతి: న్యాయవృత్తి టీ20 అంత సులభం కాదని టెస్టు క్రికెట్‌లా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే ఓపిక ఉండాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి అన్నారు. బదిలీపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు వెళుతున్న ఆయనకు సహచర న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో వివక్షకు గురవుతున్న చాలా మందికి వాళ్ల హక్కుల గురించి తెలియని పరిస్థితి ఉందన్నారు. వారికి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకు యువ న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సీజే సూచించారు. హక్కుల ఆవశ్యకతపై అవగాహన కల్పించకపోవడమూ పెద్ద నేరమే అని ఆయన తెలిపారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని