Ap News: మేం చెప్పే వరకు ప్రభుత్వ భూములు విక్రయించొద్దు: హైకోర్టు

తాజా వార్తలు

Published : 23/09/2021 17:31 IST

Ap News: మేం చెప్పే వరకు ప్రభుత్వ భూములు విక్రయించొద్దు: హైకోర్టు

అమరావతి: రాష్ట్రంలో మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ, గుంటూరులోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలు ఆపాలని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రభుత్వ భూములు వేలం వేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్లీ తాము చెప్పే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని