Sangam dairy: సంగం డెయిరీ పాలకవర్గానికి హైకోర్టులో ఊరట

తాజా వార్తలు

Published : 28/09/2021 17:33 IST

Sangam dairy: సంగం డెయిరీ పాలకవర్గానికి హైకోర్టులో ఊరట

అమరావతి: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని నమోదైన కేసులో సంగ డెయిరీ పాలకవర్గానికి ఊరట లభించింది. ఈ ఏడాది మే 29న విజయవాడలోని ఓ హోటల్‌లో సంగం డెయిరీ పాలకమండలి సమావేశం జరిగింది. అయితే అప్పట్లో కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఒకే చోట  20 మంది సమావేశమయ్యారని విజయవాడ పడమట పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

 ఐపీసీ 188, 269, 270 సెక్షన్లతో పాటు మహమ్మారి వ్యాధుల చట్టం కింద సంగం డెయిరీ ఛైర్మన్‌ సహా 20 మందిని నిందితులుగా చేర్చారు.  హోటల్‌లో గదులు బుక్‌ చేసిన వారితో పాటు సంగం డెయిరీ అధికారులను పోలీసులు విచారించారు. అయితే, పోలీసులు పెట్టిన కేసుపై సంగం డె యిరీ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఈకేసు ఇవాళ జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ బెంచ్‌లో విచారణ జరిగింది. పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి తాము చెప్పే వరకూ  తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని