బ్రహ్మంగారి మఠం తీర్మానంపై మధ్యంతర ఉత్తర్వులు

తాజా వార్తలు

Published : 16/07/2021 12:30 IST

బ్రహ్మంగారి మఠం తీర్మానంపై మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్‌ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రత్యేకాధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని.. నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ధార్మిక పరిషత్‌ ఇచ్చిన తీర్మానం ఆధారంగానే ప్రత్యేకాధికారి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని