AMARAVATI NEWS: ఐకానిక్‌ ప్రాజెక్టు డిపాజిట్లు వెనక్కి ఇవ్వండి

తాజా వార్తలు

Published : 05/08/2021 01:46 IST

AMARAVATI NEWS: ఐకానిక్‌ ప్రాజెక్టు డిపాజిట్లు వెనక్కి ఇవ్వండి

అమరావతి: అమరావతిలోని ఏపీ ఎన్‌ఆర్టీ ఐకానిక్‌ ప్రాజెక్టు నుంచి 85 శాతం మంది ఇన్వెస్టర్లు వైదొలిగారని ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టును యథాతథంగా కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఇన్వెస్టర్లు నిరాసక్తత తెలిపారని ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ సీఈవో పేరిట ఓ ప్రకటన విడుదలైంది. రాజధాని ప్రాంతంలోని ఏపీ ఎన్‌ఆర్టీ ఐకానిక్‌ భవనాల ప్రాజెక్టులోని డిపాజిట్లను వడ్డీతో సహా వెనక్కు ఇవ్వాలని ఇద్దరు ఇన్వెస్టర్లు హైకోర్టును ఆశ్రయించారని ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రాజెక్టు కోసం భూమి కొనుగోలు, అనుమతులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల నియామకం, ప్రారంభోత్సవం లాంటి అంశాలకు నిధులు ఖర్చయ్యాయని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని