Atchannaidu: శ్రీకాకుళంలో అపశ్రుతి.. కిందపడిపోయిన అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Updated : 13/10/2021 19:26 IST

Atchannaidu: శ్రీకాకుళంలో అపశ్రుతి.. కిందపడిపోయిన అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అప్పటికే వేదికపై సోఫాలో రామ్మోహన్‌నాయుడు కూర్చొన్నారు. ఆ తర్వాత అచ్చెన్న కూర్చోగానే సోఫా ఒక్కసారిగా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతో పాటు రామ్మోహన్‌నాయుడు కిందపడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ఇరువురినీ పైకి లేపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని