AP news: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు

తాజా వార్తలు

Published : 23/09/2021 22:17 IST

AP news: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు

అమరావతి: రాష్ట్రంలోని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ను  దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సమన్వయం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఆర్థికంగా వెనుకబడిన కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావటం వల్ల సంస్థల మధ్య మరింత మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశముంటుందని  ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పు కోసం ఏపీ ప్రభుత్వ బిజినెస్ నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖను, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలను ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని