CBI - ED: జగన్‌ అక్రమాస్తుల కేసు... ఈడీ అభియోగపత్రాలపై విచారణ ప్రారంభం

తాజా వార్తలు

Published : 22/09/2021 17:35 IST

CBI - ED: జగన్‌ అక్రమాస్తుల కేసు... ఈడీ అభియోగపత్రాలపై విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇటీవల దాఖలు చేసిన రెండు అభియోగపత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభించింది. జగన్‌కు నేటి విచారణ నుంచి న్యాయస్థానం మినహాయింపునిచ్చింది. వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. సమన్లు అందుకున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె.గీతారెడ్డి, పారిశ్రామిక వేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాశ్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డి, విశ్రాంత అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. వాన్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు సమన్లు అందాయా లేదా తెలపాలని ఈడీని ఆదేశిస్తూ విచారణ అక్టోబరు 28కి వాయిదా వేసింది. 

గృహనిర్మాణ ప్రాజెక్టులపై సీబీఐ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిని సీబీఐ కోర్టు  ఆదేశించింది. ఇదే కేసులో నిందితుడు జితేంద్ర వీర్వానిపై విచారణకు హైకోర్టు స్టే ఇచ్చిందని, మరో వైపు సుబ్బారెడ్డి  క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని  ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సీబీఐ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఎమ్మార్ ఈడీ కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రదీప్ ప్రమేయంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. మిగతా నిందితులపై దర్యాప్తు ముగిసిందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఎమ్మార్ ఈడీ కేసు విచారణ ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని