CBI: ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌పై సీబీఐ కేసు నమోదు

తాజా వార్తలు

Published : 30/07/2021 16:22 IST

CBI: ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌పై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న అభియోగంపై ఆదాయపన్నుశాఖ ఇన్‌స్పెక్టర్‌ తోట పురుషోత్తమరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. పురుషోత్తమరావు 12 ఏళ్లలో ఆదాయానికి మించి సుమారు రూ.1.15 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. పురుషోత్తమరావు 1991లో తాత్కాలిక ఉద్యోగిగా ఐటీశాఖలో చేరి ..వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదాయపన్ను ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రికార్డుల ప్రకారం 2008కి ముందు పురుషోత్తమరావు ఆస్తుల విలువ రూ.86,896 కాగా, 2020 డిసెంబరు నాటికి రూ.1.72 కోట్లకు చేరాయని సీబీఐ పేర్కొంది. కొన్ని ఆస్తులు పురుషోత్తమరావు భార్య సౌభాగ్యలక్ష్మి పేరిట ఉండటంతో ఆమె పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని