Bank Loans: ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలివే.. 

తాజా వార్తలు

Published : 10/08/2021 13:59 IST

Bank Loans: ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలివే.. 

వెల్లడించిన కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు 10 ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) నుంచి తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వివరణ ఇచ్చింది. ‘‘10 పీఎస్‌బీలు రూ.56,076 కోట్ల రుణాలిచ్చాయి. అత్యధికంగా ఎస్‌బీఐ రూ.15,047 కోట్ల రుణాలు ఇచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.9,450 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.7,075 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.5,797 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 4,300 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.2,307 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌ రూ.750 కోట్ల రుణాలు ఇచ్చాయి’’ అని తెలిపింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని