Hyderabad: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

తాజా వార్తలు

Updated : 07/09/2021 22:25 IST

Hyderabad: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో  భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఇలాగే మరో 8 గంటల పాటు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప రానున్న గంట సమయంలో బయటకు వెళ్లకూడదని జీహెచ్‌ఎంసీ అధికారులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. జంటనగరాల వాసులు సాయం కోసం 040- 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు.

నేడూరేపూ భారీ నుంచి అతిభారీ వర్షాలు

సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. తెలంగాణ పక్కనే మరఠ్వాడాపై 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణి దిల్లీ బాలంగీర్‌, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించింది. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణశాఖ సూచించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని