CM Jagan: గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 05/09/2021 14:13 IST

CM Jagan: గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్‌

అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్‌ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. అనంతరం జగన్‌ ఉపాధ్యాయులందరికీ టీచర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. అంతకముందు ‘‘చదువే తరగని ఆస్తి. గురువే రూపశిల్పి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని