Singareni collieries: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

తాజా వార్తలు

Updated : 06/10/2021 10:24 IST

Singareni collieries: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

Singareni collieries: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది బోనస్‌కు అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. బోనస్‌ను దసరాకు ముందే చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు.

సింగరేణిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్‌ కార్మికులకు బోనస్‌ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇసుక, ఇనుము, సున్నపురాయి తవ్వకాల్లోని సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించాలని సీఎం సూచించారు. బొగ్గు గని, విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నామన్నారు. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికలదే గొప్ప కృషి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరించడం శోచనీయమన్నారు. విశ్రాంత సిబ్బందికి కేంద్రం నుంచి పింఛన్‌ రూ.2వేల లోపు వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని