గెజిట్‌ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తాజా వార్తలు

Updated : 16/07/2021 19:56 IST

గెజిట్‌ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: కృష్ణా, గోదావరినది యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, ఈఎన్సీతో సీఎం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాల కారణంగా   రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబరు నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్పటి నుంచి జరగబోయే మార్పులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారుల ద్వారా సీఎం పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని