బీసీ వర్గాలను ఆదుకోవడమే లక్ష్యం: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 20/07/2021 17:21 IST

బీసీ వర్గాలను ఆదుకోవడమే లక్ష్యం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండో విడత పంపిణీ కోసం రూ. 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ.5వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని సీఎం అన్నారు. రెండో విడత కోసం రూ.6వేల కోట్లు నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

‘‘ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలి. కుల వృత్తులు నిర్వహిస్తున్న బీసీ వర్గాలను అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ప్రభుత్వ లక్ష్యం. సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కులవృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది. సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని