CM KCR Tour: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

తాజా వార్తలు

Updated : 04/08/2021 13:29 IST

CM KCR Tour: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

వాసాలమర్రి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతువేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు.

గతంలో ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. జూన్‌ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్‌.. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి వారితో సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. తాజాగా మరోసారి ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని