KCR: యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 19/10/2021 15:37 IST

KCR: యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. తొలుత నారసింహ ఆలయ పరిసరాలను ఏరియల్‌ వ్యూ ద్వారా ఆయన పరిశీలించారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్‌రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.

కాసేపట్లో ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. దీంతో పాటు ఆలయ పునఃప్రారంభ తేదీ, ముహూర్తాలను సీఎం వెల్లడించనున్నారు. మహా సుదర్శన యాగం వివరాలను తెలియజేస్తారు. ఇటీవల త్రిదండి చినజీయర్‌స్వామిని కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా చినజీయర్‌ ఆలయ పునఃప్రారంభతేదీ, ముహూర్తం నిర్ణయించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని