CM Jagan: బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయండి: సీఎం జగన్‌

తాజా వార్తలు

Published : 14/10/2021 18:50 IST

CM Jagan: బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయండి: సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితులపై అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన బొగ్గు కొనుగోలు చేయాలన్న సీఎం.. దీనికి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సూచించారు.  కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలన్నారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్‌ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని