కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

తాజా వార్తలు

Updated : 19/07/2021 16:13 IST

కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

హైదరాబాద్‌: కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కోకాపేట భూముల సందర్శనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ జెండాను పాతారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని