ఏపీలో కొత్తగా 2,345 కొవిడ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 16/07/2021 17:39 IST

ఏపీలో కొత్తగా 2,345 కొవిడ్‌ కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహించగా.. 2,345 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,34,450 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,097కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,001 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,96,499కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,96,437 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని