covid vaccination: తెలంగాణలో ఒక్కరోజే 4లక్షల మందికి కొవిడ్‌ టీకాలు

తాజా వార్తలు

Published : 16/09/2021 22:27 IST

covid vaccination: తెలంగాణలో ఒక్కరోజే 4లక్షల మందికి కొవిడ్‌ టీకాలు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులోనే 4లక్షల మందికి కొవిడ్‌ టీకాలు అందించి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని ప్రారంభించింది. తొలి రోజే 4,01,606 మందికి టీకాలు పంపిణీ చేసినట్టు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అందులో 2,69,067 మందికి తొలి డోస్‌, 1,32,539 మందికి రెండో డోస్‌ టీకా అందించినట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ పూర్తి చేసిన ఆరోగ్యశాఖ .. ఈనెలాఖరు నాటికి మరో కోటి డోసులు పంపిణీ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు డీహెచ్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని