HYD: నార్సింగి పీఎస్‌ సీఐ, ఎస్‌లను సస్పెండ్ చేసిన సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

తాజా వార్తలు

Published : 24/10/2021 13:55 IST

HYD: నార్సింగి పీఎస్‌ సీఐ, ఎస్‌లను సస్పెండ్ చేసిన సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌: సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి నార్సింగి పోలీసు స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెండ్ చేశారు. సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌పై భూ వివాదాలకు సంబంధించి అవినీతి అరోపణలు రావడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా ఎస్‌ఐ, సీఐలిద్దరూ భూవివాదాల్లో తలదూర్చినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు. సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ లక్ష్మణ్‌ల వ్యవహారంపై అంతర్గతంగా  సీపీ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని