ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణాధికారి నియామకం

తాజా వార్తలు

Published : 27/07/2021 19:32 IST

ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణాధికారి నియామకం

అమరావతి: ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఆర్పీ సిసోడియాను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశాలిచ్చారు. అఖిలభారత సర్వీసు క్రమశిక్షణా నిబంధనల్లోని సెక్షన్‌ 8 కింద నమోదైన అభియోగాలపై విచారణాధికారి ఆర్పీ సిసోడియా విచారణ చేపట్టనున్నారు. విచారణాధికారి ముందు ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలపై ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వొకేట్‌ను నియమించారు. మరో వైపు అఖిలభారత సర్వీసు నిబంధనల్లో క్రమశిక్షణ ఉల్లంఘన కింద నమోదైన అభియోగాలకు సంబంధించిన వివరణను నిర్ణీత సమయంలోగా విచారణాధికారికి సమర్పించాలంటూ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని