తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో సైబర్‌ క్రైం తనిఖీలు

తాజా వార్తలు

Updated : 04/08/2021 10:36 IST

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో సైబర్‌ క్రైం తనిఖీలు

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో మంగళవారం రాత్రి సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు అరగంట పాటు తనిఖీలు నిర్వహించారు. హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌, కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. తీన్మార్‌ మల్లన్నతో పాటు అతని సోదరుడు పలువురి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నట్లు యువతి ఆరోపణలు చేసింది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సదరు యువతి ఫిర్యాదు చేసింది. హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లో పలువురి వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరి సమాచారం, ఎందుకు సేకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు తనిఖీల సమాచారం తెలుసుకున్న మల్లన్న అభిమానులు కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే మల్లన్న కార్యాలయం నుంచి పోలీసులు కంప్యూటర్‌ను తీసుకెళుతుండగా ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి చేరి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని