Ganesh Nimajjanam: వీలైనంత త్వరగా నిమజ్జనానికి చర్యలు: డీజీపీ

తాజా వార్తలు

Updated : 19/09/2021 13:15 IST

Ganesh Nimajjanam: వీలైనంత త్వరగా నిమజ్జనానికి చర్యలు: డీజీపీ

హైదరాబాద్‌: భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గణేశుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా డీజీపీ మహేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షిస్తున్నాం. పోలీస్‌ స్టేషన్లకు సీసీ టీవీ కెమెరాలు అనుసంధానం చేశాం. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని డీజీపీ చెప్పారు. మరోవైపు సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ సందర్శించారు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాలను పరిశీలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని